॥శ్రీ శఙ్కరభగవత్పాదా విజయన్తే॥ ‘చాణక్యనీత్యనుసారము’ నివాసమునకు అయోగ్యమయిన ప్రదేశములు వాటి లక్షణములు - 1 శ్లో॥ యస్మిన్ దెశే న సమ్మానో న వృత్తిర్న చ బాన్ధవాః। న చ విద్యాగమః కశ్చిత్తం దేశం పరివర్జయేత్॥ - చాణక్యనీతి – 1 – 8। ప్రతిపదార్థము – యస్మిన్ దేశే = ఏ ప్రదెశమునందు; న సమ్మానః = ఆదరము లేదో; న వృత్తిః = ఆజీవికము లేదో; న చ బాన్ధవాః = బన్ధుజనసముదాయము లేదో; న చ కశ్చిత్ విద్యాగమః = ఎటువంటి విద్యయొక్క ప్రాప్తి లేదో; తం దేశం పరివర్జయేత్ = అటువంటి దేశమును (ప్రదేశమును) వదిలిపెట్టవలెను. భావము – ఏ ప్రదేశమునందు గౌరవము అనగా కొంతనైనా ఆదరము ఉండదో, అలాగే జీవనమునకు ఉపయొగపడు పని (ఉద్యోదాదులు) లేదో, అలాగే ఏ ప్రదేశమునందు బంధుజనము లేదో, అలాగే ఏ ప్రదేశమునందు విద్యాప్రాప్తి (చదువులు) లేవో ఆ ప్రదేశమునందు ఉండరాదు. అనగా ఏదేని ప్రదేశమునందు నివసించుటకు ఒక ప్రయోజకమయిన కారణము కావలెను. అది విద్యార్జనకావచ్చు ధానార్జనాదులు కావచ్చు, ఏదో ఒక కారణమునో ప్రయోజనమునో ఉద్దేశ్యము...
Posts
Showing posts from 2015