॥శ్రీ శఙ్కరభగవత్పాదా విజయన్తే॥
‘చాణక్యనీత్యనుసారము’ నివాసమునకు అయోగ్యమయిన ప్రదేశములు వాటి లక్షణములు - 1
శ్లో॥ యస్మిన్ దెశే న సమ్మానో న వృత్తిర్న చ బాన్ధవాః।
న చ విద్యాగమః కశ్చిత్తం
దేశం పరివర్జయేత్॥
-
చాణక్యనీతి – 1 – 8।
ప్రతిపదార్థము –
యస్మిన్ దేశే
= ఏ ప్రదెశమునందు; న సమ్మానః = ఆదరము లేదో; న వృత్తిః = ఆజీవికము లేదో; న చ బాన్ధవాః
= బన్ధుజనసముదాయము లేదో; న చ కశ్చిత్ విద్యాగమః = ఎటువంటి విద్యయొక్క ప్రాప్తి లేదో;
తం దేశం పరివర్జయేత్ = అటువంటి దేశమును (ప్రదేశమును) వదిలిపెట్టవలెను.
భావము –
ఏ ప్రదేశమునందు
గౌరవము అనగా కొంతనైనా ఆదరము ఉండదో, అలాగే జీవనమునకు ఉపయొగపడు పని (ఉద్యోదాదులు) లేదో,
అలాగే ఏ ప్రదేశమునందు బంధుజనము లేదో, అలాగే ఏ ప్రదేశమునందు విద్యాప్రాప్తి (చదువులు)
లేవో ఆ ప్రదేశమునందు ఉండరాదు. అనగా ఏదేని ప్రదేశమునందు నివసించుటకు ఒక ప్రయోజకమయిన
కారణము కావలెను. అది విద్యార్జనకావచ్చు ధానార్జనాదులు కావచ్చు, ఏదో ఒక కారణమునో ప్రయోజనమునో
ఉద్దేశ్యముగ పెట్టుకుని జీవికను సాగించవలెనని చాణక్యులవారి ఆశయము.
Comments
Post a Comment