అభివాదము వ్యాకరణానుసారము
అభివాదము చేసేటప్పుడు ఎట్లా ప్రత్యభివాదము చేయ్యాలి అనే విషయమును గూర్చి పాణిని మహర్షి వారు ఇట్లు సూత్రీకరించారు:
ప్రత్యభివాదేశూద్రే - అశూద్రవిషయే ప్రత్యభివాదే యద్వాక్యం తస్య టేః ప్లుతస్స్య్యాత్ సచోదాత్తః.
అంటే శూద్రభిన్నుడు అభివాదము చేసినప్పుడు ప్రత్యభివాదవాక్యము యొక్క టి భాగమునకు ప్లుతము వస్తుంది అది కూడ ఉదాత్త స్వరముతో అని దాని అర్థము. ఉదా: అభివాదయే దేవదత్తోహం అని అభివాదము చేసినపుడు పెద్దలు ప్రత్యభివాదము చేయు వాక్యము - భోః ఆయుష్మానేధి దేవదత్తా3 అని ఉండాలి.
టి భాగము అనగా: అచోంత్యాది టి - అచాం మధ్యే యోంత్య ఆదిర్యస్యతట్టిసంజ్ఙం స్య్యత్.
అర్థము - ఒక పదము లో ఎదైతే చివరి అచ్చుయో తన్మొదలుగాగల భాగము టి అను సంజ్ఙను కలిగి ఉంటుంది. ఉదా: మనస్ అనుపదములో చివరి అచ్చు మకారోత్తరవర్తి అకారము, తన్మొదలుగాగల భాగము అస్ అనునది, కావున అది టి సంజ్ఙ కలిగి ఉంటుంది. ప్రకృతము దేవదత్త అనుచోట తకారోత్తరవర్తి అకారము. దానికి ప్రత్యభివాదేశూద్రే అను సూత్రము చేత ప్లుతము వస్తుంది.
ప్లుతమనగ మూడు అంతకంటే ఎక్కువ మాత్రాకాలము కలిగిన అచ్చు. ప్లుతముని 3 - 4 లాంటి అంకెలతో సూచించడం జరుగుతుంది. ఉద: దేవదత్తా3

Comments
Post a Comment