Posts

यज्ञोपवीतधारणविधिः

Image
यज्ञोपवीत धारण वि धिः आचम्य ....... प्राणानाय म्य ....... श्री परमेश्वरप्रीत्य र्थं मम ब्रह्मतेजसः अभिवृद्धर्थं , सकल -श्रौ त - स्मार्त नित्य - कर्मानुष्ठान अधिकार - योग्यता सिद्ध्यर्थं , नूतन - यज्ञोपवीत - धारणं करिष्ये | यज्ञोपवीतं कुंकुमादिना अलंकृत्य | त्रिराचमेत्  | द्विः  परिमृज्य  |  सकृदुपस्पृश्य  |  यत्सव्यं पाणिं पादौ प्रक्षति  ।  शिरश्चक्षुषी नासिके श्रोत्रे । ॐ यज्ञोपवीतं परंमं पवित्रं प्रजापते र्यत्सहजं पुरस्तात्। आयुष्यमग्र्यं प्रतिमुञ्चशुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः॥ धृत्वा । त्रिराचमेत् | द्विः परिमृज्य | सकृदुपस्पृश्य | यत्सव्यं पाणिं पादौ प्रक्षति । शिरश्चक्षुषी नासिके श्रोत्रे । गृहस्थाश्रमांगत्वेन द्वितीय यज्ञोपवीत धारणं करिष्ये | ॐ यज्ञोपवीतं परंमं पवित्रं प्रजापते र्यत्सहजं पुरस्तात्। आयुष्यमग्र्यं प्रतिमुञ्चशुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः॥   धृत्वा |  त्रिराचमेत्  | द्विः  परिमृज्य  |  सकृदुपस्पृश्य  |  यत्सव्यं पाणिं पादौ प्रक्षति ...
॥శ్రీ శఙ్కరభగవత్పాదా విజయన్తే॥ ‘చాణక్యనీత్యనుసారము’ నివాసమునకు అయోగ్యమయిన ప్రదేశములు వాటి లక్షణములు - 1 శ్లో॥  యస్మిన్‍ దెశే న సమ్మానో న వృత్తిర్న చ బాన్ధవాః।             న చ విద్యాగమః కశ్చిత్తం దేశం పరివర్జయేత్‍॥ -         చాణక్యనీతి – 1 – 8। ప్రతిపదార్థము – యస్మిన్‍ దేశే = ఏ ప్రదెశమునందు; న సమ్మానః = ఆదరము లేదో; న వృత్తిః = ఆజీవికము లేదో; న చ బాన్ధవాః = బన్ధుజనసముదాయము లేదో; న చ కశ్చిత్‍ విద్యాగమః = ఎటువంటి విద్యయొక్క ప్రాప్తి లేదో; తం దేశం పరివర్జయేత్‍ = అటువంటి దేశమును (ప్రదేశమును) వదిలిపెట్టవలెను.   భావము – ఏ ప్రదేశమునందు గౌరవము అనగా కొంతనైనా ఆదరము ఉండదో, అలాగే జీవనమునకు ఉపయొగపడు పని (ఉద్యోదాదులు) లేదో, అలాగే ఏ ప్రదేశమునందు బంధుజనము లేదో, అలాగే ఏ ప్రదేశమునందు విద్యాప్రాప్తి (చదువులు) లేవో ఆ ప్రదేశమునందు ఉండరాదు. అనగా ఏదేని ప్రదేశమునందు నివసించుటకు ఒక ప్రయోజకమయిన కారణము కావలెను. అది విద్యార్జనకావచ్చు ధానార్జనాదులు కావచ్చు, ఏదో ఒక కారణమునో ప్రయోజనమునో ఉద్దేశ్యము...

అభివాదము వ్యాకరణానుసారము

అభివాదము చేసేటప్పుడు ఎట్లా ప్రత్యభివాదము చేయ్యాలి అనే విషయమును గూర్చి పాణిని మహర్షి వారు ఇట్లు సూత్రీకరించారు: ప్రత్యభివాదేశూద్రే - అశూద్రవిషయే ప్రత్యభివాదే యద్వాక్యం తస్య టేః ప్లుతస్స్య్యాత్ సచోదాత్తః . అంటే శూద్రభిన్నుడు అభివాదము చేసినప్పుడు ప్రత్యభివాదవాక్యము యొక్క టి భాగమునకు ప్లుతము వస్తుంది అది కూడ ఉదాత్త స్వరముతో అని దాని అర్థము. ఉదా: అభివాదయే దేవదత్తోహం అని అభివాదము చేసినపుడు పెద్దలు ప్రత్యభివాదము చేయు వాక్యము - భోః ఆయుష్మానేధి దేవదత్తా3 అని ఉండాలి. టి భాగము అనగా: అచోంత్యాది టి - అచాం మధ్యే యోంత్య ఆదిర్యస్యతట్టిసంజ్ఙం స్య్యత్ . అర్థము - ఒక పదము లో ఎదైతే చివరి అచ్చుయో తన్మొదలుగాగల భాగము టి అను సంజ్ఙను కలిగి ఉంటుంది. ఉదా: మనస్ అనుపదములో చివరి అచ్చు మకారోత్తరవర్తి అకారము, తన్మొదలుగాగల భాగము అస్ అనునది, కావున అది టి సంజ్ఙ కలిగి ఉంటుంది. ప్రకృతము దేవదత్త అనుచోట తకారోత్తరవర్తి అకారము. దానికి ప్రత్యభివాదే శూద్రే అను సూత్రము చేత ప్లుతము వస్తుంది. ప్లుతమనగ మూడు అంతకంటే ఎక్కువ మాత్రాకాలము కలిగిన అచ్చు. ప్లుతముని 3 - 4 లాంటి అంకెలతో సూచించడం జరుగుతుంది. ఉద: దేవదత్తా3  ...